జనసేన అధినేతకు మరోసారి చిక్కు వచ్చి పడింది. మిగతా అన్ని విషయాలపై…మరీ ముఖ్యంగా ఉత్తర-దక్షిణం అంటూ లేని సమస్యలపై తక్షణమే స్పందించే పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబునాయుడికి చెడ్డపేరు తెచ్చే విషయాలపైన మాత్రం అస్సలు స్పందించడు. చిన్నపాటి వర్షానికే సచివాలం, అసెంబ్లీలోకి నీరు ప్రవేశించిడం చంద్రబాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోంది. వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్ళు రావడాన్ని జగన్ కుట్రగా తిప్పికొట్టే ప్రయత్నాన్ని గట్టిగానే చేస్తున్నారు కానీ సచివాలయంలోకి కూడా నీళ్ళు వచ్చిన విషయాన్ని సమర్థించుకోలేకపోతున్నారు. అన్నింటికీ మించి సచివాలయం, అసెంబ్లీలోకి మీడియాను ఎందుకు అనుమతించడం లేదు అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
చిన్న వర్షానికే రాజధాని భవనాలు లీక్ అయ్యాయన్న వార్త ఆంధ్రప్రదేశ్ జనాలను బాగానే కదిలించింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే చంద్రబాబుపై సెటైర్స్ మోత మోగిపోతోంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబును ఇబ్బంది పెట్టే చాలా విషయాల్లో పవన్ సరైన సమయంలో స్పందించడం లేదు అన్న మాట వాస్తవం. ఇప్పుడు పవన్ స్పందించకపోతే కూడా చంద్రబాబు తప్పు ఉందేమో అని అనుమానించాల్సిన పరిస్థితి. అలా కాకుండా పవన్ కూడా తన వెర్ణన్ తాను వినిపిస్తేనే బాగుంటుంది. అవసరమైతే అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందా? లేక ప్రతిపక్షనేత జగన్ కుట్ర ఉందా అనే విషయాంపై తన స్పందన తెలియచేస్తే బాగుంటుందేమో. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కదిలించిన సమస్య గురించి అస్సలు స్పందించకుండా మౌనంగా ఉండడం మాత్రం కచ్చితంగా సమర్థుడైన నాయకుడి లక్షణం అయితే కాదు.