గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం గౌతమ్ నంద. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకువస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని, ఓ పాత్రలో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే… అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని కొట్టి పడేశాడు సంపత్ నంది. ”గోపీచంద్ విలన్ కాదు. ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉన్నారు. ముఖేష్ రుషి, తంగబలి విలన్లుగా కనిపిస్తారు. గోపీచంద్ క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయి. అంతే తప్ప.. తనది డ్యూయెల్ రోల్ కాదు” అని క్లారిటీ ఇచ్చేశాడు.
రమణ మహర్షి పుస్తకం ‘హూ యామ్ ఐ’ నుంచి స్ఫూర్తి పొంది.. ‘గౌతమ్ నందా’ కథ రాశాడట సంపత్ నంది. గోపీచంద్ ఓ మిలియనీర్. డబ్బు, సంపద, హోదా… వీటిపై విరక్తి వచ్చి, జనం మధ్యలోకొచ్చి ఓ సామాన్యుడిలా బతుకుతాడు. అప్పుడు గౌతమ్ నందాకి ఎదురైన పరిస్థితులేంటి? అనేదే ఈ సినిమా కథ. చూస్తుంటే ‘బిచ్చగాడు’, ‘అత్తారింటికి దారేది’ షేడ్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నట్టున్నాయి. మరి తెరపై సంపత్ నంది ఈ కథని ఎలా చూపించాడో ఏంటో??