తెరపై కామెడీ చేసి, తెగ నవ్వించేసే యాక్టర్ల అసలు జీవితం… కుళ్లు కంపు కొడుతుండడం చూస్తూనే ఉన్నాం. స్టార్లు.. బయటే. ఇంట్లో మాత్రం మనసులేని మనుషుల్లా ప్రవర్తిస్తుంటారు. తెరపై వాళ్లని చూసి కొలిచేవాళ్లే… నిజ జీవితంలో వాళ్ల నిజ స్వరూపం చూస్తే.. ‘ఇదేం బుద్ది?’ అనిపించకమానదు. ప్రస్తుతం ఫృథ్వీని చూస్తున్నా.. అదే అనిపిస్తోంది. చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన.. ఇంకా ఎదుగుతున్న నటుడు ఫృథ్వీ. ’30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఇక్కడ’ అనే ఒక్క డైలాగ్ అతన్ని పాపులర్ చేసేసింది. స్నూఫ్‌లు, పేరడీలతో పైకొచ్చాడు. అతని డైలాగ్ డెలివరీ, టైమింగ్.. యునిక్‌గా ఉంటాయ్. అందుకే… ఫృథ్వీ కనిపించగానే పగలబడి నవ్వుతున్నారంతా! రోజుకి లక్ష సంపాదించే ఆర్టిస్టులలో పృథ్వీ ఒకడు. అలాంటి ఫృథ్వీ నిజ జీవితంలో మాత్రం విలన్‌గా మారాడేమో అనిపిస్తుంది.
ఫృథ్వీ పై ఇది వరకు చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. `నన్ను పెళ్లి చేసుకొంటానని చెప్పి మోసం చేశారు` అంటూ ఇది వరకు ఓ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆ కేసుని ఎలాగోలా సాల్వ్ చేసుకోగలిగాడు ఫృథ్వీ. కానీ.. సొంత భార్యనే నిర్ణక్ష్యం చేయడం, చెడు వ్యసనాలకు లోనై… భార్యని ఇబ్బంది పెట్టడంతో ఆమె కోర్టు మెట్లెక్కింది. భార్యని నిర్లక్ష్యం చేస్తున్నందుకు… ప్రతీ నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాల్సిందిగా విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఫృథ్వీని ఆదేశించింది. ఫృథ్వీ భార్య శ్రీలక్ష్మిది విజయవాడ. అక్కడ వాళ్లకో స్వీటు దుకాణం ఉండేది. పెళ్లయిన కొత్తలో ఫృథ్వీ ఆ దుకాణ బాధ్యతల్ని చూసుకొనేవాడు. ఫృథ్వీ.. కుటుంబానికి అదే ఆధారం కూడా. అప్పటి నుంచే ఫృథ్వీకి సినిమాలపై ఆసక్తి ఉండేది. అందుకోసం తరచూ చెన్నై వెళ్తూ.. వస్తూ ఉండేవాడు. చిన్న చిన్న పాత్రలు తప్పితే పెద్దగా బ్రేక్ రాలేదు. సినిమా రంగంలో మెల్లమెల్లగా అవకాశాలు వస్తున్న తరుణంలో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చాడు పృథ్వీ. ఇక్కడికొచ్చాక… ఫృథ్వీ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. భార్యని నిర్లక్ష్యం చేయడం మొదలెట్టాడు. దాంతో… ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యని పుట్టింటికి పంపేసిన ఫృథ్వీ కొన్నాళ్లుగా ఆమె ఆలనా, పాలనా చూడడం మానేశాడు. దాంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయించింది. తన భర్త నుంచి నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించవలసిందిగా న్యాయస్థానాన్ని కోరుకొంది. ఈ విషయంపై ఫృథ్వీకి ఎన్ని సమన్లు పంపినా జవాబు రాలేదు. కోర్టుకి కూడా హాజరు కాలేదు.దాంతో ఆగ్రహించిన న్యాయస్థానం.. ప్రతీ నెలా రూ.8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది.