సరికొత్త కథలతో, పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు నారా రోహిత్. నటన, నిర్మాణమే కాదు, తనలో ఇంకో టాలెంట్ ఉంది. అదేంటో తెలుసా?? వంటలు వండడం. రోహిత్ చేయి తిరిగిన వంటగాడట. మరీ ముఖ్యంగా చేపల పులుసు బ్రహ్మాండంగా చేస్తాడట. తన చేతి వంట రుచి, వంట ప్రావిణ్యం సెట్లోనూ చూపించేశాడు. నారా రోహిత్ కొత్త సినిమా ‘శమంతకమణి’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సెట్లో… చేపల పులుసు చేయబోతున్నారన్న సంగతి తెలుసుకొని, వంట గదిలోకి వెళ్లిపోయాడు నారా రోహిత్. తనే దగ్గరుండి మరీ చేపల పులుసు చేసి పెట్టాడు. రోహిత్ వండిన చేపల పులుసు… చిత్ర బృందం మొత్తం లొట్టలు వేసుకొంటూ తిన్నదట.ఆ విడియోని శమంతకమణి టీమ్ విడుదల చేసింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈచిత్రంలో ఆది, సందీప్ కిషన్, సుధీర్‌బాబు కథానాయకులుగా నటిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.