మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. జాదూగాడు ఫేమ్ సోనారిక హీరోయిన్ గా నటిస్తుంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
మంచు విష్ణు లాంటి హీరో, డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ వంటి మంచి నిర్మాతలు ఈ చిత్రంలో ఉండటం చాలా హ్యపీగా ఉంది. లవ్ లోకొత్త యాంగిల్ చూపే లవ్ విత్ యాక్షన్ ఎంటర్ టైనర్. సినిమాని నాలుగు షెడ్యూల్స్ లో హైదరాబాద్, వైజాగ్ లలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరి. విష్ణుగారి బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అనూప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తామని చిత్ర దర్శకుడు జి.కార్తిక్ రెడ్డి అన్నారు.
మా బ్యానర్ లో చేస్తున్న రెండో మూవీ. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తాం. మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్. విష్ణుగారికి బాడీ లాంగ్వేజ్ కి తగిన స్టోరి. సోనారిక బబ్లీ గర్ల్ గా నటిస్తుంది అని నిర్మాతలు డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, సోమా విజయ్ ప్రకాష్ అన్నారు.
ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. విష్ణుతో నటించడానికి ఎదురుచూస్తున్నానని హీరోయిన్ సోనారిక అన్నారు.
బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఎడిటర్: యస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్ రెడ్డి.