రంజాన్ కానుకగా లవకుశ టీజర్‌ని విడుదల చేద్దామనుకొంది చిత్రబృందం. అందుకు సంబంధించి టీజర్ కూడా కట్ చేసింది. మరి ఏమైందో.. ఆ ఆలోచన విరమించుకొంది. అయితే ఈలోగా టీజర్ లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జరిగిపోయాయి. ”అది కేవలం రఫ్ వెర్షన్ మాత్రమే.. అసలు టీజర్ కాదు” అంటూ చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అసలు వెర్షన్ సిద్ధమైంది. ఈ టీజర్ ని 6న విడుదల చేస్తారు. జై లకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రలకు తగ్గట్టు మూడు టీజర్లు కట్ చేశారు. జై, లవ, కుశ.. ఇలా మూడు పాత్రల్ని పరిచయం చేస్తూ.. మూడు టీజర్లు విడుదల చేస్తారన్నమాట. టీజర్ టీజర్‌కి మధ్యలో వారం రోజులు గ్యాప్ వచ్చేలా చూసుకొంటోంది చిత్రబృందం. సో.. జులై నెల మొత్తం జై లవకుశ సందడి చూడొచ్చన్నమాట. అన్నట్టు.. రఫ్ వెర్షన్ టీజర్ అదిరిపోయింది. దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కేక పెట్టించేశాయి. కొసరే అలా ఉంటే.. మరి అసలు టీజర్ ఎలా ఉంటుందో. వెయిట్ అండ్ సీ.