తప్పు చేయడం మానవ సహజం. తప్పులు అందరూ చేస్తారు. ఎంతటి వారైనా ఎదో సందర్భంలో మాట జారుతారు. అయితే జరిగిన తప్పును మాత్రం కొందరే సరిదిద్దుకుంటారు. ఎలాంటి బేషజం లేకుండా క్షమాపణ కోరుతారు. దర్శకుడు రాజమౌళి కూడా ఇప్పుడు అదే చేశారు.
బాహుబలి లో శివగామి పాత్రకు తొలుత శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే. ఆమె పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో నోరు జారేశారు రాజమౌళి. అక్కడితో ఆగలేదు. ఆ షో నిర్వహిస్తున్న సదరు హోస్ట్ ”తీసుకోకపోవడమే మంచిదయిందని” ఓ వెకిలి నవ్వు నవ్వాడు. అదేదో భూమి బద్దలైపోయిన జోక్ అన్నట్టు రాజమౌళి కూడా ఆ సదరు హోస్ట్ తో నవ్వు పంచుకున్నాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఆ హోస్ట్ కు బుద్దిలేదు సరి రాజమౌళికి ఏమైయింది? అంటూ కామెంట్లు కొట్టారు.
అయితే శివగామి పాత్ర ఒప్పుకోకపోవడం ఎదో నేరం అయినట్లు శ్రీదేవి కనిపిస్తే చాలు ఇదే ప్రశ్న ఆమె ముందు వుంచింది మీడియా. ఈ విషయంలో ఆమెకూడా అసహనానికి లోనైయింది.
అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో తప్పు ఒప్పుకున్నాడు రాజమౌళి. ఈ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యలో.. నిజమే శ్రీదేవి గారి గురించి అలా మాట్లాదసింది కాదు. పబ్లిక్ ఫ్లాట్ ఫాం పై ఆలా చర్చించుకోవడం తప్పే. దీనికి చింతిస్తున్నా” అని ఎలాంటి బేషజం లేకుండా తన తప్పును అంగీకరించాడు రాజమౌళి.
ముందే చెప్పుకున్నాం కదా తప్పులు అందరూ చేస్తారు. దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకోవడమే గొప్ప.