బోయాపాటి శ్రీనుది ప్రత్యేకమైన మార్క్. యాక్షన్ దట్టించడంలోనూ, హీరోయిజాన్ని ఓ స్థాయిలో చూపించడంలోనూ దిట్ట. క్లాస్ ఆడియన్స్ చేత కూడా విజిల్స్ వేయించడంలో నేర్పరి. ఆయన్నుంచి ఓ సినిమా వస్తోందంటే… మాస్ మసాలా ఐటెమ్స్ ఊహించుకొని రెడీ అయిపోతుంటాడు ప్రేక్షకుడు. అయితే.. ఈసారి బోయపాటి షాక్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం జయ జానకీ నాయక. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ జంటగా నటించారు. టీజర్ బయటకు వచ్చింది. బోయపాటి మార్క్ యాక్షన్ దినుసులు లేని టీజర్ ఇది. జయ జానకీ నాయక.. అనే బ్యాక్ గ్రౌండ్ హమ్మింగ్తో… ఈ టీజర్ కట్ చేశారు. తన సినిమాకి ఓ క్లాస్ టచ్ ఉన్న టైటిల్ పెట్టి ఎంత ఆశ్చర్యపరిచాడో, ఇప్పుడు టీజర్‌తోనూ అలా షాక్ ఇచ్చాడు. ఎక్కడా.. దరువులు, అరుపులు, కేకలు లేకుండా.. లవ్లీ మూమెంట్స్‌తో టీజర్‌ని కట్ చేశాడు బోయపాటి. ఫస్ట్ లుక్ కూడా సాఫ్ట్‌గానే విడుదల చేసిన బోయపాటి.. సెకండ్ లుక్‌లో బెల్లం కొండ కండలు చూపించి ఈ సినిమాలోని మాస్ ఎలిమెంట్స్‌ని బయటపెట్టాడు. రేపో మాపో.. రెండో టీజర్ వస్తుంది. అందులో మాస్ మసాలా.. దట్టిస్తాడేమో చూడాలి. అగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.