టాలీవుడ్లో చిన్న అలికిడి కనిపిస్తే చాలు.. స్పందించే గుణం వర్మకి ఉంది. పాజిటీవ్ అంశంపై నెగిటీవ్‌గా, నెగిటీవ్ విషయంపై పాజిటీవ్‌గా రియాక్ట్ అవ్వడం వర్మ శైలి. కొన్ని కొన్ని సార్లు వర్మ పొగుడుతున్నాడో, ఆ పేరు చెప్పి తిడుతున్నాడో అర్థం కాదు. అందుకే వర్మ ట్విట్టర్ ఖాతా ఎప్పుడూ… ఆకర్షిస్తుంటుంది. ‘ఇలాంటి విషయాలకు కూడా స్పందించొచ్చా’ అనే సందర్భాల్లోనూ.. స్పందిస్తూ తన ప్రత్యేకత చాటుకొనే వర్మ… టాలీవుడ్‌ని కుమ్మేస్తున్న డ్రగ్స్ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. గత రెండు మూడు రోజుల నుంచీ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని ఊపేస్తోంది. వర్మ శిష్యులు, వర్మకి కావల్సినవాళ్లు, వర్మ కాంపౌండ్‌తో సంబంధాలున్న చాలామంది పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి. అయినా సరే.. వర్మ నోరు మెదపడం లేదు.
ట్విట్టర్‌కి గుడ్‌బై అంటూ… కూయడం ఆపేసిన వర్మ… కనీసం ఇన్స్ట్రగ్రామ్ లో అయినా స్పందిస్తాడని వర్మ అభిమానులు భావించారు. అయితే.. వర్మ నుంచి ఊ లేదు…. ఆ లేదు. ఎందుకనో.. వర్మ ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నాడు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని తొలిసారి భయపడుతున్నాడేమో. సెక్స్ గురించి, తన తాగుడు అలవాటు గురించి బహిరంగంగా మాట్లాడిన వర్మ.. డ్రగ్స్ గురించి ఎప్పుడూ స్పందించలేదు. జీవితాన్ని వీలైనంత విచ్చలవిడిగా గడిపేయడానికి అలవాటు పడిన వర్మ… డ్రగ్స్ విషయంలో నోరు మెదపకపోవడానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని టాలీవుడ్ భావిస్తోంది. మరి వర్మ ఏమంటాడో?? ఎప్పుడు స్పందిస్తాడో??