https://www.youtube.com/watch?time_continue=103&v=qxWPG_3ZOh8
ఈమధ్య గోపీచంద్ టైమ్ ఏమీ బాగో లేదు. తన దగ్గర్నుంచి సినిమా వచ్చి యేడాది దాటేసింది. ఆరడుగుల బుల్లెట్ వాయిదా పడింది. ఆక్సిజన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. గోపీ ఆశలన్నీ.. గౌతమ్ నందపైనే.
ధనం మూలం ఇదం జగత్ అనే కాన్సెప్టుతో రూపుదిద్దుకొన్న చిత్రం గౌతమ్ నంద. సంపత్ నంది దర్శకుడు. ఈనెల 28న ఈ చిత్రం విడుదల అవుతోంది. ట్రైలర్ బయటకు వదిలారిప్పుడు. షాట్ బై షాట్ చూస్తే.. రిచ్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ సినిమాల్లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ కావొచ్చు. ఓ ఫీల్ గుడ్ పాయింట్‌ని కమర్షియల్ టచ్‌తో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. `ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండులు మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బొక్కటే` అనే ఫేస్ బుక్ డైలాగ్‌ని వాడుకొన్నా, దర్శకుడు తాను చెప్పదలచుకొన్న పాయింట్‌ని స్ట్రయిట్‌గానే చెప్పే ప్రయత్నం చేశాడనిపిస్తోంది. గోపీచంద్ నుంచి ఆశించే యాక్షన్నీ బా గా దట్టించాడు. ఇక అందాలకు కొరత లేదు. ఓ వైపు హన్సిక, మరో వైపు కేథరిన్. తమన్ పాటలు క్యాచీగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతాలేం చేయకపోవొచ్చు గానీ. నిరాశకు మాత్రం గురిచేయదు అన్న కాన్ఫిడెన్స్ కలుగుతోంది. చూద్దాం.. ఈ గౌతమ్ నంద ఏం చేస్తాడో.??