గత సంక్రాంతికి ఎన్టీఆర్, బాలకృష్ణల చిత్రాలు ఒకేసారి బాక్సాఫీసు ముందుకు వచ్చాయి. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో… సంక్రాంతికి ఢీ కొట్టుకొంటే.. అందులో నాన్నకు ప్రేమతోనే నిలచింది. ఇప్పుడు మరోసారి బాబాయ్ అబ్బాయ్‌ల చిత్రాలు ఢీ కొట్టుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ దసరాకి ఎన్టీఆర్, బాలయ్యల చిత్రాలు విడుదలకు సై అంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లవకుశ, బాలయ్య పైసా వసూల్ చిత్రాలు దసరాకి విడుదల అవుతున్నాయి. లవకుశ 21న, పైసా వసూల్ 29న రావాల్సివుంది. అయితే… పైసావసూల్ని కూడా 21నే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా విడుదల రోజునే… పైసా వసూల్ విడుదల చేయాలని పూరి జగన్నాథ్ పట్టుపడుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే.. పైసా వసూల్ సినిమా పూర్తయింది. రెండు రోజులు టాకీ చేస్తే… పోస్ట్ ప్రొడక్షన్‌కి వెళ్లిపోవొచ్చు. ఎంతకాదన్నా.. నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తాడు పూరి. సినిమాని అనుకొన్నదానికంటే ముందే సిద్ధం చేయడంలో పూరికి తిరుగులేదు. అందుకే… ఎట్టిపరిస్థితుల్లోనూ 21నే విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడట. అయితే బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది.
పూరికి ఈమధ్య హిట్లు లేవు. పైసా వసూల్ పై కూడా అంత భీకరమైన బజ్ అయితే పుట్టలేదు. మరోవైపు లవకుశకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్‌తో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ దశలో కావాలని పైసా వసూల్ని దించడం.. యుద్ధానికి సై అనడమే. ఈ సినిమాపై పూరికి బాగా గురి కుదిరిందని, అందుకే ఎన్టీఆర్ పై సవాల్ కి సిద్ధం అవుతున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. పైసా వసూల్ Vs లవకుశకు దాదాపుగా రంగం సిద్ధం అవుతోంది. కావల్సిందల్లా… బాలయ్య అనుమతి మాత్రమే. మరి బాలయ్య ఏమంటాడో చూడాలి.