ముఖేష్ అంబానీ విడుదల చేస్తున్న రిలయన్స్ జియో ఫోన్‌తో దేశంలో సంభాషణలు మాత్రమే గాక సమాచార ప్రసార రంగంలోనూ సంచలన మార్పులు రావడం తథ్యం. అత్యాధునికమైన 4 జి పీచర్లతో ఫోన్ ఉచితంగా ఇచ్చేస్తామంటున్న రిలయన్న్ అధినేత ముందుగా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. వాస్తవానికి వారి వ్యాపారప్రకటనల్లోనూ మోడీని ఉపయోగించారు. నిజంగానే జియో ఫోన్ రేపు మోడీకి గొప్ప ప్రచార సాధనం కానుందని పరిశీలకులు మీడియా వర్గాలు భావిస్తున్నాయి. టీవీ ప్రసారాలు నిరాటంకంగా జియోలోనే చూసే వీలేర్పడుతుంది. దీనికి తోడు బిజెపి ప్రచార విభాగం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నది. దీనివల్ల జరిగేదేమంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా ముందు మోడీ కనిపిస్తారు.. ఇంటింటికీ మోడీ అన్న మాట పాతబడిపోయి మనిషి మనిషికీ మోడీ ప్రత్యక్షమవుతారు. ఇతర పార్టీలూ కూడా జియోను వాదుకోవచ్నని ఎ వరైనా అనవచ్చు గాని ఆ విధమైన వనరులు యంత్రాంగం బిజెపికి వున్నంతగా మరెవరికీ లేవు. అంబానీలతో సహా కార్పొరేట్ ఇండియా ఆయనను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాటకొస్తే జియో ఫోన్ వ్యవస్థనే అందుకు అనుగుణంగా మలచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏది ఏమైనా 2019 ఎన్నికల నాటికి ప్రచారం కొత్త పుంతలు తొక్కడం ఖాయం.