రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘రంగ స్థలం’. 2018 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి సీజన్ అన్నివిధాలా బాగుంటుందని, సుకుమార్ – చరణ్‌లకు కూడా ఈ సీజన్ అచ్చొచ్చిందని, అందుకే సంక్రాంతికి రావడమే బెటర్ అని అయితే… ఇప్పుడు ఆ నిర్ణయం మారిందని తెలుస్తోంది. సంక్రాంతి కంటే ముందుగా అంటే.. క్రిస్మస్ కే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నాడట. దానికి కారణం.. అక్షరాలా.. పవన్ కల్యాణ్.
పవన్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీన్ని సంక్రాంతికి విడుదల చేద్దామనుకొంటున్నారు. బాబాయ్‌తో పోటీ పడి తన సినిమాని విడుదల చేయడం ఇష్టంలేని చరణ్.. తమ సినిమాకి కాస్త ముందుగా తీసుకురావాలని డిసైడ్ అయినట్టు టాక్. సుకుమార్ కూడా… చరణ్ మాటకు కాదనలేకపోతున్నాడని, అందుకే షూటింగ్ కాస్త స్పీడప్ చేస్తున్నాడని తెలుస్తోంది. పవన్ అభిమానుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి చరణ్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల పవన్ అభిమానుల మనసుల్ని గెలుచుకొనే కామెంట్లు చేశాడు. పవన్ బాబాయ్ అమ్మతో సమానం.. అనే అర్థం వచ్చేలా మాట్లాడి పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు పవన్ కోసం రిలీజ్ డేటే మార్చుకోవడానికి రెడీ అంటున్నాడు. ఇక పవన్ ఫ్యాన్స్ చరణ్‌కి ఫిదా అవ్వకుండా ఉంటారా??