టాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్ (రోనీ) అరెస్ట్ టాలీవుడ్‌ని మరో షాక్‌లో పడేసింది. రోనీకీ డ్రగ్స్ మాఫియాకూ దగ్గర సంబంధాలున్నాయన్నది సిట్ అబియోగం. మణికొండలోని రోనీ నివాసంపై సిట్ అధికారులు దాడి చేసి రోనిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. పెద్ద మొత్తంగా గంజాయిని స్వాధీనం చేసుకొన్నట్టు వార్తలొస్తున్నాయి. రోనీ కాజల్ కి మేనేజర్‌గా వ్యవహరించడం, ఇద్దరుముగ్గరు కథానాయికలతో దగ్గర సంబంధాలు ఉండడంతో.. ఈ అరెస్ట్ కలకలం సృష్టించింది. ఈ విషయంపై కాజల్ స్పందించింది.
‘రోనీ గురించి తెలిసి షాకయ్యా. సమాజానికి హాని కలిగించే పనులు చేసే వారంటే నాకు నచ్చదు. అలాంటి వాళ్లకు నేను అస్సలు మద్దతు తెలపను. నా కోసం పనిచేసే వారి గురించి పట్టించుకుంటాను.. కానీ వారు తప్పులు చేస్తే సమర్థించను. చిత్ర పరిశ్రమలో అందరితో నాకు వృతిపరమైన సంబంధాలే ఉన్నాయి. కానీ వారితో వృతిపరంగా నా పని అయిపోయాక.. వారు ఎక్కడున్నారు, ఏం చేస్తుంటారనే విషయాలు పెద్దగా పట్టించుకోను’ అని కాజల్ చెబుతోంది. కాజల్ నుంచి స్పష్టమైన స్టేట్మెంట్ వచ్చేసింది. ఇక రాశీఖన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే… రోని రాశీఖన్నా డేట్లు కూడా చూసుకొనేవాడు మరి.