హైదరాబాద్: సినిమారంగంవారికి, క్రికెటర్లకు అవినాభావ సంబంధం ఏదో ఉన్నట్లుంది. ఈ రెండు రంగాలకు చెందిన మరో ఇద్దరు సెలబ్రటీలు ఒక్కటవబోతున్నారు. సీనియర్ నటి రాధిక కుమార్తె రయానే కర్ణాటకకు చెందిన ప్రముఖ క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను పెళ్ళాడబోతోంది. ఈ నెల 23న చెన్నైలో వీరిద్దరి నిశ్చితార్థం జరుగనుంది. నటి రాధిక ఈ విషయాన్ని ధృవీకరించారు. తన కుమార్తె ముఖ్యమైన సందర్భం దగ్గరలోకి వచ్చిందని, ఆశీస్సులు అందజేయాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అతికొద్దిమంది సన్నిహిత మిత్రులు, రయానే ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుందని తెలిపారు.
అభిమన్యు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ తరపున… వన్డేలలో భారతజట్టులో ఆడాడు. ఒక ఐపీఎల్ పార్టీలో కలుసుకున్న అభిమన్యు, రయానే కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. వీరి ఎఫైర్ గురించి తమిళ మీడియాలో చాలా రోజులుగా కథనాలు వస్తున్నాయి. ఇరుపక్షాల తల్లిదండ్రులూ వీరి వివాహానికి అంగీకరించటంతో నిశ్చితార్థం ఖరారయింది. రయానే రాధికకు రెండో భార్త రిచర్డ్ హార్డీ వలన కలిగిన సంతానం. ఆమె ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.