నాగార్జునకు బాగా అచ్చొచ్చిన నెల.. డిసెంబరు. ఈ నెలలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ తన తనయుడు విషయంలోనూ కలిసొస్తుందని భావిస్తున్నాడు నాగ్. అందుకే… అఖిల్ తదుపరి చిత్రాన్ని డిసెంబరులోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. అఖిల్ – విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కథానాయిక పేరూ.. ఇంకా డైలామాలోనే ఉంది. అయితే.. ఇప్పుడు రిలీజ్ డేట్ బయటకు వచ్చేసింది. డిసెంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని నాగ్ ప్రకటించారు. కాసేపటి క్రితం ట్విట్టర్లో రెండు వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేశారు నాగ్. ”ఇప్పుడే ఈ సినిమాలోని ఓ బిట్ చూశా. విక్రమ్, వినోద్ మరోసారి మ్యాజిక్ చేసేశారు. ఈసినిమాని నాకు అచ్చొచ్చిన నెల డిసెంబరులో విడుదల చేయబోతున్నా” అని ట్విట్టారు నాగ్. సో… నాగ్ కి బాగా కలిసొచ్చిన డిసెంబరు నెల… అఖిల్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.