గౌతమ్ నంద ప్రీ క్లైమాక్స్‌లో కళ్లు చెదిరే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు సంపత్ నంది. అయితే ఆ ట్విస్ట్ .. ముందు ఊహించిందే. గౌతమ్ నందలో గోపీచంద్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని, అందులో ఒకటి విలన్ గా అని.. తెలుగు 360 కూడా ముందే చెప్పింది. అయితే అటు సంపత్‌నంది గానీ, ఇటు గోపీచంద్ గానీ ఈ విషయంలో గోప్యత పాటించారు. ‘రెండు పాత్రలా?’ అని ఇద్దరిలో ఎవరిని అడిగినా ‘రెండు పాత్రలు కాదు.. ఒకటే పాత్ర రెండు షేడ్స్’ అంటూ నిజాన్ని దాచారు. సంపత్ నంది కూడా ‘గోపీచంద్ విలన్ గా కనిపిస్తున్నాడన్న వార్తలో నిజం లేదు. మా సినిమాలో చాలామంది విలన్లను డబ్బులు పెట్టి పెట్టుకొన్నాం.. ‘ అని వ్యాఖ్యానించారు. రిలీజ్ కి ముందిచ్చిన ఇంటర్వ్యూలలోనూ ఇదే తంతు. తీరా చూస్తే గోపీచందే విలన్.. తనే హీరో!
నిజానికి ఈ కథకు ఇదే అసలైన ట్విస్ట్. అలాంటప్పుడు ఆ ట్విస్టు ముందే రివీల్ అయిపోతే కిక్ ఉండదు. అందుకే… ఆ విషయాన్ని దాచేశారు సంపత్‌నంది, గోపీచంద్. ఈ విషయంలో వాళ్లనీ తప్పుపట్టలేం. కాకపోతే… చిత్రీకరణ సమయంలోనే డ్యూయెల్ రోల్ అన్న సంగతి బయటకు వచ్చేసింది. అలాంటి లీకేజీలు లేకుండా జాగ్రత్త పడితే బాగుండేది.