వెంకటేష్, రానా కలసి నటిస్తున్నారా? వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందా? టాలీవుడ్లో ఈ ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రానా – వెంకీలతో ఓ సినిమా చేయాలని సురేష్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌లో నాగచైతన్యనీ తీసుకురావాలన్నది ఆయన ప్లాన్. అయితే… కొన్ని కథలు విన్నా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తమిళంలో విడుదలైన ‘విక్రమ్ వేద’పై వెంకీ గురి పడిందని, ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేయాలనుకొంటున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మాధవన్, విజయ్ సేతుపతి కలసి నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకీ – రానా చేయాలనుకొంటున్నార్ట. మాతృక తీసిన దర్శకుడికే రీమేక్ బాధ్యత అప్పగించాలని చూస్తున్నట్టు ఓ వార్త షికారు కొడుతోంది.
అయితే.. ప్రస్తుతానికి వెంకీకి ఆ ఉద్దేశమే లేదని సమాచారం. రానా తన సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. వెంకీ సోలోగా.. ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకొంటున్నాడు. బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్ సెట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నా.. ప్రస్తుతానికి అవేం వర్కవుట్ కావడం లేదని టాక్. చేస్తే.. వెంకటేష్ – రానా – నాగచైతన్యలతో కలసి మల్టీస్టారర్ చేస్తానని… లేదంటే.. ఆ ఊసే తీయనని డి.సురేష్ బాబు కూడా గట్టిగానే చెబుతున్నాడు. సో.. వెంకీ – రానా కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టే.