గౌతమ్ నంద సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు గోపీచంద్. ఆక్సిజన్, ఆరగడుగుల బుల్లెట్, గౌతమ్ నంద – ఈ మూడు సినిమాల్లోనూ తన అంచనాలన్నీ ఈసినిమాపైనే ఉండేవి. ఆడియో ఫంక్షన్లో ”ఇదిగో ఈసారి సూపర్ హిట్ కొట్టేస్తున్నాం కాచుకోండి” అన్నట్టుగానే మాట్లాడాడు. ఇంటర్వ్యూలలోనే ఓవర్ కాన్షిడెన్స్ ప్రదర్శించాడు. సాధారణంగా కూల్ గా కామ్ గా ఉండే గోపీచంద్ – ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే కచ్చితంగా సినిమాలో విషయం ఉండే ఉంటుందనుకొన్నారంతా. తీరా చూస్తే… సినిమా ఫట్ మంది. దాంతో.. గోపీచంద్ కలల మేడలు కూలిపోయాయి. ఈ సినిమాపై రిజల్ట్ కోసం ఆరగడుగుల బుల్లెట్, ఆక్సిజన్ కాచుకొని కూర్చున్నాయి.
గౌతమ్ నంద పాజిటీవ్ గా ఉంటే.. ఈ నెలలోనే మరో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిపోదును. ఆక్సిజన్ మాటేమో గానీ, ఆరగుడుల బుల్లెట్ మాత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేద్దును. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. తొలి రోజు మినహాయిస్తే.. వసూళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. రూ.25 కోట్లతో తీసిన సినిమా ఇది. పట్టుమని పది కోట్లు కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. దాంతో… ఆరగుడుల బుల్లెట్ విడుదల మరీ క్లిష్టమైపోయింది. అదనే కాదు.. ఆక్సిజన్ కూడా ఇప్పట్లో ధైర్యం చేయకపోవొచ్చు. ఓ ఫ్లాప్… రెండు సినిమాలపై ప్రభావం చూపించేసింది. గోపీచంద్ సినిమా థియేటర్లో చూడాలంటే ఇంకొంతకాలం ఆగక తప్పదు.