మెల్లమెల్లగా బిగ్ బాస్ ఆదరణ పెరుగుతూ పోతోంది. తెలుగునాట అన్ని రియాలిటీ షోల్లో బిగ్ బాస్ దే హవా. బిగ్ బాస్ పుణ్యమా అని మా టీవీ రేటింగులు భారీగా పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ టాలెంట్‌తో కాస్త అది టాక్ ఆఫ్ ది షో అయ్యింది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ ఎంత రానుంది? అనే విషయం ఆసక్తిని రేకెత్తించింది.కనీసం కోటి రూపాయలకు తక్కువ కాకుండా నగదు బహుమతి ఉంటుందనుకొన్నారు. అయితే… బిగ్ బాస్ విజేతకు లభించేది రూ.50 లక్షలు మాత్రమేనట. బాలీవుడ్ స్థాయిలో బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఊహించని స్థాయిలో ఉంది. దక్షిణాదిన మాత్రం అంత ఇవ్వడం లేదు. రూ.50 లక్షల బహుమతి తక్కువే. పైగా అందులోంచి టాక్సులు కట్ అవుతాయి. అయితే… 70 రోజులు ఉన్నందుకుగానూ.. రోజుకి ఇంత చొప్పున కనీసం మరో రూ.50 లక్షలు అందుకుంటాడు సెలబ్రెటీ. దాంతో కలుపుకొంటే కోటి దక్కినట్టే. అంతే కాదు.. బిగ్ బాస్ విజేతకు ప్రైజ్ మనీనే కాదు.. గిఫ్ట్ హ్యాంపర్లు కూడా లక్షల్లో లభిస్తాయి. దానికి తోడు బోల్డంత పాపులారిటీ కూడా. సో.. బిగ్ బాస్ షో విజేతకు లాభదాయకమే.