ఆచారి అమెరికా యాత్ర షూటింగ్లో భాగంగా కథానాయకుడు మంచు విష్ణుకి గాయాలైన సంగతి తెలిసిందే. మంచు విష్ణు క్షేమంగానే ఉన్నాడని, ప్రమాదంలో స్పల్పగాయాలతో బయటపడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోజే తెలియజేశారు. ఇప్పుడు మంచు విష్ణు ఓ వీడియోని విడుదల చేశాడు. తాను క్షేమంగానే ఉన్నానని మోకాలు, మోచేయిలకు గాయాలయ్యాయని, భుజానికీ గాయమైందని, శస్త్ర చికిత్స అవసరమో, కాదో ఇంకా తెలియలేదని స్పష్టం చేశాడు విష్ణు. అయితే డాక్టర్లు మాత్రం 4 నుంచి 6 వారాల విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట. తిరిగొచ్చాక ఎప్పట్లా షూటింగుల్లో పాలుపంచుకొంటానని, ఇది వరకటి ఉంటే ఉత్సాహంగా పనిచేస్తానని చెబుతున్నాడు విష్ణు. సాధారణంగా తాను రిస్కీ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోంటానని, అయితే అనుకోకుండా ప్రమాదం జరిగిందని, ఈ విషయంలో తన తప్పేం లేదని, కుటుంబ సభ్యలు, స్నేహితులు మాత్రం కంగారు పడ్డారని, అందుకు తనని క్షమించమని కోరుతున్నానని చెప్పుకొచ్చాడు. తనకు ప్రమాదం జరిగిన వీడియోని త్వరలోనే విడుదల చేస్తానని, అప్పుడు అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం అర్థమవుతుందని విష్ణు చెబుతున్నాడు. ఒకట్రెండు రోజుల్లో ఆచారి అమెరికా యాత్రకు సంబంధించిన ఓ వీడియో రాబోతోంది. అది చూస్తే విష్ణుకి ప్రమాదం ఎలా జరిగిందో ఓ క్లారిటీ వస్తుంది.
"I am Fine….Thankyou!!!"https://t.co/7pnaRfWx8r
— Vishnu Manchu (@iVishnuManchu) August 7, 2017