మహేష్ అభిమానులకు ఈరోజు రెండు పండగలు. ఒకటి మహేష్ పుట్టిన రోజు. రెండోది స్పైడర్ టీజర్ వచ్చిన రోజు. ఈ టీజర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. టీజర్లో అయినా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుందా? లేదా?? అని ఎదురుచూపులు చూశారు. మొత్తానికి స్పైడర్ టీజర్ వచ్చేసింది. 70 సెకన్ల ఈ టీజర్లో మురుగదాస్ కాన్సెప్ట్ చెప్పేశాడు. జనాల ప్రాణాలతో ఆడుకొనే విలన్ – అతనికి భయాన్ని పరిచయం చేసే హీరో – ఇదీ స్పైడర్ కాన్సెప్ట్. హీరో – విలన్ల దోబూచులాట ఈ సినిమా. దానికి సైన్స్ ఫిక్షన్ జోడించినట్టు అర్థమవుతోంది. రెగ్యులర్ కమర్షియల్ కథే. కాకపోతే.. దానికి మురుగదాస్ ఇంటిలిజెన్సీ యాడ్ అవ్వబోతోంది. హీరో, విలన్ పాత్రలపై ఓ క్లారిటీ వచ్చేసింది. మురుగదాస్ స్క్రీన్ ప్లే తెలివితేటలు, మహేష్ బాబు స్టార్డమ్, సాంకేతిక విలువలు… వెరసి ఈ స్పైడర్ని ఊహలకు అందని ఎత్తులో నిలబెట్టాయి. ఈ దసరాకి స్పైడర్ విడుదల అవుతోంది. ఈలోగా ఇంకెన్ని వింతలు చూపిస్తారో మరి.