బోయపాటి శ్రీను కాస్త ట్రాక్ మార్చాడనిపిస్తోంది. మాస్, యాక్షన్ దర్శకుడిగా ముద్రపడ్డ బోయపాటి…. జయజానకి నాయకతో ప్రేమకథ ఎంచుకొన్నాడు. ఇందులో యాక్షన్ అంశాలున్నా.. బేసిగ్గా జయ జానకి నాయక లవ్ స్టోరీనే. మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాలన్నది బోయపాటి ఆలోచన. దమ్ము సమయంలోనే మహేష్‌కి ఓ కథ వినిపించాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ మహేష్ – బోయపాటి సినిమా ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘త్వరలోనే మహేష్‌తో ఓ సినిమా చేస్తున్నా’ అని బోయపాటి చెప్పేశాడు. ఆ సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందని, షాకింగ్ జోనర్ అని హింట్ ఇస్తున్నాడు బోయపాటి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఇదో సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుందట. వర్కింగ్ డేస్ కూడా చాలా పెద్ద మొత్తం లో అవసరం అయ్యాయట. ఈ ప్రాజెక్టుమీదే కనీసం యేడాదైనా కేటాయించాలట. మహేష్ యేడాదికి రెండు సినిమాలు చేసే మూడ్‌లో ఉన్నాడిప్పుడు. ఆ టైమ్ ఓ సినిమాకి కేటాయించాలంటే బాగా ఆలోచించాలి కదా? అందుకే… మహేష్ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదట. లైన్ మాత్రంగా కథ చెప్పాడని, అతి త్వరలో మహేష్ – బోయపాటిల మధ్య మరో సిట్టింగ్ జరగబోతోందని తెలుస్తోంది. మొత్తానికి బోయపాటి ట్రెండ్ మార్చాడు. ఇది శుభసూచకమే.