ఎన్నికల సలహాదారుగా ప్రశాంత కిశోర్‌ను తీసుకువచ్చాక వైఎస్ఆర్సిపిలో తమాషా అయిన చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయట. పోరాడేది డబ్బు పెట్టేది మనమైతే మధ్యలో ఈయన సలహా ఏమిటి అని కొందరు విసుక్కుంటున్నారు. మా లోకల్ పరిస్తితులు ఆయనకేమీ తెలుసని కూడా అంటున్నారట. మీ మొహం చూసి ఓటేస్తారు గాని ప్రశాంత కిశోర్‌ను చూసి ఎవరేస్తారని కొందరు నేరుగా జగన్నే అడిగారట. దానికాయన ఒకింత వినోదంగా కొంత విసుగ్గా సమాధానమిచ్చారట.. ‘ నేను ఎవరి మాట వినడం లేదని మీరే అంటారు. వింటానని ఈ సలహాదారుణ్ని తెచ్చుకుంటే మళ్లీ ఇలా అంటున్నారే.. మోడీ అంతటి వ్యక్తికి సలహాలిచ్చిన మనిషి అని గుర్తు పెట్టుకోండి అని చెప్పారట. పోనీలే కనీసం జగన్‌కు మేము నేరుగా చెప్పే అవకాశం ఎలాగూ రాదు, చెప్పినా వినిపించుకోరు.. ఇప్పుడు ప్రశాంత కిశోర్ ద్వారా చెప్పొచ్చు అని చాలామంది వైసీపీ నేతలు సంతోషిస్తున్నారు. మరోవైపున ఆయన సర్వేల ప్రహసనం ఏం నివేదికలు తెప్పించి ఎ వరికి ఎసరు పెడుతుందోనన్న ఆందోళన కూడా వారిలో వుంది. ఏమైనా వైసీపీలో పికె ఎఫెక్ట్ చాలానే వుందన్నది సత్యం.