మనకున్న అతికొద్ది మంది సెన్సిబుల్ డైరెక్టర్లలో శేఖర్ కమ్మల ఒకడు. శేఖర్ వచ్చాకే.. తెలుగు సినిమాకి కాస్త నేచురల్ టచ్వచ్చిందంటే అతిశయోక్తేం కాదు. తన ఫీలింగ్స్‌ని చాలా నిజాయతీగా, సహజంగా పంచుకొంటాడు శేఖర్ కమ్ముల. తను లవ్‌స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో ఆనంద్‌లో తెలిసింది. హ్యాపీడేస్లోనూ లవ్ స్టోరీ ఉంటుంది కానీ… ఎక్కువగా ఫ్రెండ్ షిప్, కాలేజీ లైఫ్ మీద ఫోకస్ చేసిన సినిమా అది. ఫిదాతో తొలిసారి పూర్తి స్థాయి ప్రేమ కథ తెరపైకి తీసుకొచ్చాడు శేఖర్ కమ్ముల. ఆ సినిమా అటు ప్రేక్షకులకు, ఇటు విమర్శకులకు బాగా నచ్చింది. హ్యాపీడేస్ స్థాయిలో వసూళ్లను కుమ్ముకొంటోంది. ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల నుంచి ఓ లవ్ స్టోరీ రాబోతోందట. అది కూడా.. ఫిదా స్టైల్ ఆఫ్ మేకింగ్‌లోనే, తెలంగాణ నేటివిటీతో సాగబోతోందని సమాచారం. ఈ సినిమా మాత్రం తన సొంత బ్యానర్ లో తీసుకోవాలని నిర్ణయించుకొన్నాడట. ”ఫిదా లాంటి మరో లవ్ స్టోరీ చేయాలన్న ఆలోచన ఉంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈసారి కొత్తవాళ్లతో ప్రయత్నిద్దామనుకొంటున్నా..” అంటున్నాడు శేఖర్ కమ్ముల. తన కోసం అడ్వాన్సులు పట్టుకొని చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. కానీ తాను మాత్రం సొంత నిర్మాణ సంస్థలోనే సినిమా తీయాలని ఫిక్సయ్యాడు. ఈసారి శేఖర్ కమ్ముల నుంచి ఎలాంటి లవ్ స్టోరీ రాబోతోందో??