నంద్యాల ఎన్నికల ప్రచారం ముగిసే వేళ రాజకీయ పార్టీల తూటాలు చివరి ఘట్టానికి చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి కుటుంబంపై చేసిన అవినీతి ఆరోపణలకు వారు గట్టిగా సమాధానమిచ్చారు. మేము తెలుగుదేశంలో వున్నప్పుడు కనిపించలేదా? అప్పుడు మెచ్చుకుని ఇప్పుడు దాడి చేస్తున్నారా అంటూ ఆరోపణలను ఖండించారు. లోతుపాతులు ఎలా వున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడ్డం ఎవరూ పెద్ద తీవ్రంగా తీసుకోరన్నది నిజం. ఇక వైసీపీ త్వరలో బిజెపితో కలసి పోతుందని రిపబ్లిక్ టీవీ కథనంప్రసారం చేస్తే దాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఇవ్వడం కూడా ఒక చర్చనీయాంశమైంది. టిడిపి కావాలనే బిజెపిని దూరం పెట్టడం ఒకటైతే దాన్ని తమకు అంటకట్టడంఏమిటని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాము అంశాల వారిగా మద్దతు ఇస్తామని మొదటే చెప్పాము తప్ప ప్రత్యేక హౌదా వంటి వాటిపై రాజీ పడే ప్రసక్తి లేదన మరోసారి ప్రకటించారు. ఇక మంత్రి సోమిరెడ్డి తన విమర్శలు కొనసాగిస్తూ జగన్ తరపున విదేశాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. టిడిపి ఎంఎల్సిని చేసిన మాజీ మంత్రి ఫరూక్ మేనల్లుడు వైసీపీలో చేరారు. శిల్పా మోహనరెడ్డి గాక జగన్ మాత్రమే ప్రచారం చేయడానికి కారణం ఈ ఆరోపణలేనని మంత్రి అఖిల ప్రియ ధ్వజమెత్తారు.
ఇక కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని తమపై కుట్ర చేసి బిజెపిలో చేరతామన్నట్టు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎంపి వైవీసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంపైన ప్రచారపర్వం ముగుస్తున్నా మాటల తూటాలు పేలుతూనే వున్నాయంటే పోటీ ఏ స్తాయిలో వుందో, పాలక పక్షమే ఫిర్యాదులు చేయడంలో విచిత్రమేమిటే అంతుపట్టడం లేదు. ఇప్పటికి నియోజకవర్గంలో కోటికి పైగా నగదు పట్టుకున్నారు.తాము వైసీపీ ఫిర్యాదులకే స్పందిస్తున్నామన్న ఆరోపణను ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ తోసిపుచ్చారు. ఇక అంతా కమిషన్ చేతుల్లోనే వుంటుంది మరి.