ఏదేమైనా.. ‘అర్జున్‌రెడ్డి’కి కావల్సినంత ప్రచారం లభించేస్తోంది. నిన్నా మొన్నటి వరకూ కాస్త కామ్‌గా, స్థబ్దుగా సాగిన అర్జున్ రెడ్డి ప్రచార పర్వం.. వీహెచ్ రాకతో జోరందుకొంది. అసభ్యంగా కనిపిస్తున్నాయని చెప్తూ… ఆర్టీసీ బస్సులపై ఉన్న అర్జున్ రెడ్డి పోస్టర్లని వీహెచ్ పీకేయడంతో కాస్త కలలకం రేపింది. దానికి తోడు మహిళా సంఘాలు కూడా ఈ పోస్టర్లేంటి అంటూ ప్రశ్నిస్తున్నాయి. సెన్సార్ వాళ్లు ఎలగూ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి – ఈ ప్రచారానికి ఇంకాస్త మషాలా అంటింది. ఇప్పుడు చిత్రబృందం తాయితీగా మేల్కొంది. లిప్ లాక్ పోజుతో ఉన్న పోస్టర్లని ఎక్కడున్నా సరే.. తీసేస్తాం అంటూ తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో.. మహిళా సంఘాల వారినీ, వీహెచ్ లాంటి రాజకీయ నాయకుల్నీ కాస్త శాంతింప జేయొచ్చు. అది సరే గానీ.. వెండి తెరపై కనిపించబోతున్న ఘాటు ముద్దుల మాటేంటి?
– అదొక్కటీ అడగొద్దు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టికెట్టు తెగడానికి, థియేటర్లలోకి అడుగుపెట్టడానికీ ఆకర్షించే అతి ప్రధాన అంశాల్లో అదొకటి. ముద్దు సీన్లు యధావిధిగా ఉండబోతున్నాయి. పోస్టర్లు మాత్రం కనిపించవు. తెరపై ఆ లిప్ లాక్కుల్నీ తీసేస్తే… ఇప్పటి వరకూ చేసుకొచ్చిన ప్రచారం ఏమైపోతుంది?? ఈ సినిమాలో ఘాటు ముద్దులున్నాయి అన్న సంగతి ఎలాగో ప్రచారం ద్వారా తెలిసిపోయింది కాబట్టి.. పోస్టర్లు పీకేస్తారంతే. థియేటర్లలో మాత్రం ఆ మసాలా.. కంటిన్యూ అవ్వబోతోంది. అదీ.. మేటరు.