నాగచైతన్య తాజా చిత్రం ‘యుద్దం శరణం’. ఈ సినిమాతో కృష్ణ ముత్తు అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. కృష్ణ – నాగచైతన్య ఇద్దరూ చిననాటి మిత్రులు. నాలుగో తరగతి నుంచే కలసి చదువుకొన్నార్ట. ఇద్దరూ ఒకే రోజు పుట్టార్ట. అంతేకాదు.. ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారట. ఈ విషయం నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ‘యుద్దం శరణం’ ఆడియో విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ”కృష్ణ నా చిన్న నాటి స్నేహితుడు. ఎనిమిదో తరగతిలో ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాడు. ఆ యుద్దంలో నేను గెలిచా. ఇప్పుడు ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ విషయంలో తనే గెలవాలి. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలి. దర్శకుడిగా తాను నిలబడాలి” అని ఆకాంక్షించాడు చైతూ. సెప్టెంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో విషయం ఉన్నట్టే కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్లు చూసి చాలా కాలమైంది. మరి ఈ స్నేహితులిద్దరూ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి సినిమా అందిస్తారో చూడాలి.