నంద్యాల ఎన్నికలలో ఘోర పరాజయం కారణంగా సలహాదారు ప్రశాంత కిశోర్‌ను పంపించేస్తారనే ప్రచారంలో నిజం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక ఆయనను తీసుకోవడానికి ముందే ఎప్పుడో రంగం సిద్ధమైన పరిస్తితి.పైగా ఆయన ఇక్కడ లోతుగా దిగబడింది కూడా లేదు. తన మనుషులతో కొన్ని సర్వేలు మాత్రం చేయించారు. అవన్నీ శాంపిల్స్లాటివే గాని ఆయన పూర్తి పనికి ప్రతిబింబాలు కాదు. పైగా అంత ఆర్బాటంగా అందరి ముందు ప్రవేశపెట్టిన మనిషిని ఒక్క ఓటమితోనే పంపించేస్తే అది అధినేతకూ అభిశంసన అవుతుంది. కనుక ప్రశాంత కిశోర్ పని కొనసాగుతుంది గాని మరింత కట్టుదిట్టం కావచ్చు.కొన్ని కొత్త పద్ధతులు కూడా తీసుకోవచ్చు అంటున్నారు సన్నిహితులు. ఆయన రావడం ఇష్టం లేని కొందరు ఈ అవకాశాన్ని చూసుకుని కావాలని ఇలాటి ప్రచారాలు చేస్తున్నారని వారంటున్నారు.