నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే ఆ ఊపు వేరుగా ఉంటుంది. ఎన్ని సినిమాలున్నా సరే.. పక్కకు తప్పుకోవాల్సిందే. కాంపిటీషన్ ఉన్నా బాలయ్య జోరుకు ఎవ్వరూ స్పీడు బ్రేకర్లు వేయలేరు. పైగా ఈ సారి సోలో రిలీజ్. సెప్టెంబరు 1న మరో కొత్త సినిమా థియేటర్లో కనిపించదు… కాకపోతే ఒకటే అడ్డు.. ఆ అడ్డు పేరు.. అర్జున్ రెడ్డి.
గతవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకొంటోంది. వారాంతం గడిచినా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ జోరు ఇంకొన్ని రోజులు ఉండడం ఖాయం. శుక్రవారం విడుదలయ్యే పైసా వసూల్ – మాస్‌ని, బాలయ్య అభిమానుల్ని కట్టి పడేస్తే ఫర్వాలేదు. కాస్త అటూ ఇటూగా ఉంటే.. అర్జున్ రెడ్డి మళ్లీ రెచ్చిపోవడం ఖాయం. యువతరం ఇంకా అర్జున్ రెడ్డి ఫీవర్లోనే ఉన్నారు. వన్ మోర్లు పైసా వసూల్ కంటే.. అర్జున్ రెడ్డికే పడతాయి. రిపీట్ ఆడియన్స్ దక్కించుకొంటున్న సినిమాకి కళ్లెం వేయడం కష్టం. మరి.. పైసా వసూల్ ఆ మ్యాజిక్ చేయగలదా?? అర్జున్ రెడ్డి జోరు అడ్డుకోగలిగేది పైసా వసూల్ ఒక్కటే. బాక్సాఫీసు దగ్గర పైసా వసూల్ ప్రభావం చూపలేకపోతే మాత్రం మరో వారం రోజులు విచ్చలవిడిగా వసూళ్లు సాధించుకోవడానికి అర్జున్ రెడ్డికి ఫుల్ ప్రీడమ్ ఇచ్చేసినట్టే.