‘‘కుమారి 21ఎఫ్’ వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం. మౌనరాగం, ప్రేమదేశం తరహాలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు దేవిశ్రీప్రసాద్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణలను అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్, ఆర్.రత్నవేలు సంయుక్తంగా విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సుకుమార్‌కు బాగా ఇష్టమైన కథతో రూపొందిస్తున్న చిత్రమిది. టాకీపార్ట్ పూర్తయింది. సమిష్టి కృషితో అనుకున్న సమయంలో చిత్రీకరణను పూర్తిచేశాం. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రతి సన్నివేశాన్ని అందంగా దృశ్యమానం చేశారు’ అని అన్నారు. ఛాయాగ్రహకుడు ఆర్.రత్నవేలు మాట్లాడుతూ ‘భిన్నమైన ప్రేమకథా చిత్రమిది. సుకుమార్ శైలిలో సాగుతుంది. దేవి వినసొంపైనా బాణీలను ఇచ్చారు. రాజ్‌తరుణ్ నటన సహజత్వంతో సాగుతుంది. సుకుమార్, దేవి, నా కాంబినేషన్లో వస్తోన్న మరో మంచి చిత్రంగానిలుస్తుంది’ అని తెలిపారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘వినోదంతో పాటు చక్కటి సందేశమున్న చిత్రమిది. రత్నవేలు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు. విజువల్‌గా చాలా అద్భుతంగా ఉంటుందిపతాప్ దర్శకత్వ ప్రతిభ, రాజ్‌తరుణ్, హేభా పటేల్ నటన ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. ‘కెరీర్ ప్రారంభంలోనే సుకుమార్, దేవి, రత్నవేలు లాంటి సీనియర్స్‌తో పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టం. నవ్యమైన అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువతరంతో పాటు కుటుంబ వర్గాలను మెప్పిస్తుంది’ అని రాజ్‌తరుణ్ పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సుకుమార్ తరహాలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఆయన అందించిన కథ, సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడ రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాతో రాజ్‌తరుణ్ హ్యాట్రిక్ హిట్‌ను అందుకోవడం ఖాయం. త్వరలో ఆడియోను, అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. తొలి సినిమాతోనే సుకుమార్,దేవిశ్రీప్రసాద్ లాంటి హేమాహేమీలతో పనిచేయడం ఆనందంగా ఉందని హేభాపటేల్ చెప్పింది. ఈ కార్యక్రమంలో నోయల్, బి.రామచంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.