ఇటీవల తమిళంలో విడుదలై సూపర్‌హిట్ అయిన చిత్రం ‘స్ట్రాబెరి’. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అనువాద హక్కులను సాయిరాం ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. సురేష్ దూడల సమర్పణ. పా విజయ్ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్షన్ చేశారు. అవని మోడి హీరోయిన్. సముద్రఖని, దేవయాని ప్రధానపాత్రధారులు. కామెడి హర్రర్ కాన్సెప్ట్ తో ఈ సెప్టెంబర్ 11న 280కి పైగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలై సూపర్‌హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. బేబి అను ఈ సినిమా కీలకపాత్రలో నటించింది. తమిళనాట జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి నిర్మాత పి.సాంబశివరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలుః రాజశేఖర్ రెడ్డి, పాటలుః శివగణేష్, ఫైట్స్ః రాకీ రాజేష్, సంగీతంః తజ్నూర్, కెమెరాః మార వర్మన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః అలంక వేణు, నిర్మాతః పి.సాంబశివరెడ్డి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః పా విజయ్.