నరేష్ సుడి ఏమంత బాలేదు. సినిమాల జోరు తగ్గింది. వచ్చిన సినిమా ఆడడం లేదు. నరేష్ సినిమా అనేసరికి బయ్యర్లు భయపడుతున్నారు. మినిమం గ్యారెంటీ హీరో కాస్తా… ఆ గ్యారెంటీని కోల్పోయాడు. మేడమీద అబ్బాయి సినిమా చూస్తే… నరేష్ ప్రస్తుత పరిస్థితేంటో అర్థమవుతుంది. నరేష్ సినిమా అంటే మినమం బిజినెస్ జరిగిపోయేది. నిర్మాతకు టేబుల్ ప్రాఫికట్ దక్కేది. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమాని కొనడానికి ఒక్క బయ్యరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ సినిమాపై రూ.8.5 కోట్లు పెట్టాడు నిర్మాత. ఒక్క ఏరియా కూడా అమ్మలేదు. బయ్యర్ ఎవరొచ్చినా షేర్ గ్యారెంటీ ఉందా? అని అడుగుతున్నార్ట. అదృష్టవశాత్తూ శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. జెమిని వాళ్లు ఈ సినిమాని రూ.3 కోట్లకు కొన్నారు. అయితే.. వాళ్లూ అడ్వాన్సులు ఇచ్చి సరిపెట్టుకొన్నార్ట. దాంతో నిర్మాత తన సొంత ఖర్చుతో ఈ సినిమాని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా బాగుంటే ఫర్వాలేదు. నిర్మాత సేఫ్ అయిపోతాడు. అటూ ఇటూ అయితే… నిర్మాతకే కాదు, నరేష్కీ రిస్కే. ఒక విధంగా నరేష్ కి ఇది డూ ఆర్ డై లాంటి సినిమా. మరి రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి. ఈనెల 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.