బాక్సాఫీసు దగ్గర అర్జున్ రెడ్డి సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల మార్క్‌కి చేరుకొంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ఫిగర్ దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతటి సూపర్ సక్సెస్ అయిన సినిమా మరి శాటిలైట్ రూపంలో ఎంత దక్కించుకొంటుందో?? అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు శాటిలైట్ కోసం ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇది `ఏ`సర్టిఫికెట్ సినిమా. టీవీ కోసం మరోసారి సెన్సార్ చేయాల్సివస్తుంది. రీసెన్సార్కి వెళ్తే.. కీలకమైన సీన్స్ అన్నింటికీ కత్తెర పడే అవకాశాలుంటాయి. అందుకే శాటిలైట్ కోసం ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం శాటిలైట్ మార్కెట్లో ఈ సినిమాకి మంచి రేటు పలికే అవకశాలున్నాయని తెలుస్తోంది.చిత్రబృందం కేవలం శాటిలైట్ హక్కులే కాకుండా, డిజిటల్ రైట్స్‌తో కలిపి అమ్మేద్దామనుకొంటోంది. జెమినీ వాళ్లకు రూ.10 కోట్లకు బేరం పెట్టిందట చిత్రబృందం. యూ ట్యూబల్లో ఎక్కడ ఏ బిట్, పాట ప్లే అయినా.. దానికి సంబంధించిన ఆదాయం జెమినీకే వెళ్తుందన్నమాట. జెమినీవాళ్లేమో రూ.7 కోట్ల వరకూ వచ్చి ఆగినట్టు తెలుస్తోంది. కనీసం రూ.8 నుంచి రూ.9 కోట్లలోపు బేరం తెగే అవకాశాలున్నాయి. రూ.4 కోట్లతో తెరకెక్కించిన సినిమా ఇది. డిజిటల్ రైట్స్ రూపంలోనే ఇంత మొత్తం వస్తున్నాయంటే… అర్జున్ రెడ్డికి బ్లాక్ బ్లస్టర్ జాబితాలో చేర్చేయడంలో తప్పేం లేదు కదా??