మహేష్ బాబు కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడట. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో బిజినెస్ జరుపుకున్న మూవీ స్పైడర్ అని ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. మురగదాస్ దర్శకత్వంలో తెలుగు తమిళ బాషలలో తెరకెక్కుతున్న మహేష్ బాబు స్పైడర్.. బాహుబలి తర్వాత అంత స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగాప్రచారం జరుగుతుంది.
బాహుబలి ఒక ఘన చరిత్ర సృస్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎవరూ టచ్ చేయాలేని లెవల్ లో వసూళ్ళు సాధించింది. ఏ ఒక్క రికార్డు ను వదలలేదు. వంద రికార్డులు వుంటే.. ఆ వంద రికార్డులు బాహుబలి ఖాతాలో పడిపోయాయి. అన్నీ బాహుబలికే వెళ్ళిపోయాయి.
ఇక మిగిలిన సినిమాలకు రికార్డులు లేకపొతే ఎలా ? కిక్ వుండదు కదా?!. అందుకే ట్రేడ్ మార్కెట్ కొత్త రికార్డు ను కనిపెట్టింది. అదే.. ”నాన్ బాహుబలి’. దిని అర్ధం ఏమిటంటే.. బాహుబలి ఓ తోపు సినిమా. దాని లెక్క వేరు. దానిది సపరేటు కేటగిరి. ఇప్పుడు బాహుబలి రికార్డుల పక్కపెట్టి.. జనరల్ సినిమా రికార్డులను మాత్రమే అసలు లెక్క అంటూ ఓ ఈక్వేషన్ ఇచ్చేశారు. దీంతో ‘నాన్ బాహుబలి రికార్డ్’ అంటూ మళ్ళీ రచ్చ మొదలైయింది.
ఆమధ్య అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసిందని, బాహుబలి తర్వాత ఆ రేంజ్ వసూళ్లు సాధించిందని.. స్వయంగా బన్నీ బాబు చెప్పుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నాన్ బాహుబలి రికార్డ్ ను క్రియేట్ చేసిందని తెగ ప్రచారం జరిగిపోయింది. ఫిదా కూడా నాన్ బాహుబలి రికార్డ్ లో చేరిందని చెప్పారు. ”బాహుబాలి తర్వాత అమెరికాలో అంత ఆదరణ పొందిన సినిమా మా ఫిదా” అని నిర్మాత దిల్ రాజు ప్రకటించుకున్నారు. ఇప్పుడు మహేష్ స్పైడర్ కూడా నాన్ బాహబాలి రికార్డు ను క్రియేట్ చేసిందని, బాహుబలి తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఆదరగొట్టిన సినిమాగా రికార్డు పుటల్లోకి ఎక్కిందని జోరుగా ప్రచారం సాగిపోతుంది. మరి… ఆ లెక్కలు ఏమిటనేది మాత్రం బయటికి తెలియదు. ఎందుకంటే.. సినిమా రికార్డులు , లెక్కలు ఎప్పుడూ దేవరహస్యాలే కద.!!