మహేష్‌బాబు స్పైడర్ ఆడియో ఫంక్షన్ అతిథులెవ్వరూ లేకుండానే సాగిపోయింది. ఈ ఫంక్షన్‌కి శంకర్, రాజమౌళి వస్తారని ఆశించారంతా. కానీ.. వాళ్లు లేకుండానే ఆడియో విడుదల చేసేశారు. ఈనెల 15న హైదరాబాద్ లో ట్రైలర్‌ని విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి తెలుగు నుంచి ప్రముఖ దర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ ఆశీస్సుల కోసం చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. రజనీకాంత్ రాకపోయినా.. ఆయన వీడియో బైట్ అయినా తీసుకోవాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఆదివారం మురుగదాస్ రజనీకాంత్‌ని కలుసుకొన్నట్టు టాక్. ఆ సందర్భంలోనే ‘స్పైడర్’కి సంబంధించిన ఓ వీడియో బైట్ తీసుకొన్నారని తెలుస్తోంది.
మరోవైపు రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి తమిళ దిగ్గజాలను మహేష్‌బాబు వ్యక్తిగతంగా కలుసుకొని, వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకొన్నాడట. మహేష్ తమిళంలో నేరుగా చేస్తున్న సినిమా ఇది. ఒక విధంగా తమిళ ఇండ్రస్ట్రీకి పరిచయం అవుతున్నట్టే లెక్క. అందుకే… అక్కడి పబ్లిసిటీపై దృష్టి పెట్టాడు. తెలుగులో పబ్లిసిటీ ఎలా ఉన్నా, ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. ఈ స్థాయిలో కాకపోయినా.. తమిళంలోనూ భారీ వసూళ్లు దక్కించుకోవాలని మహేష్ భావిస్తున్నాడు. తెలుగునాట మహేష్ మార్కెట్ రూ.100 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. తమిళంలోనూ మహేష్‌కి ఓ మార్కెట్ ఏర్పడితే దాదాపు రూ.150 కోట్ల హీరో అవుతాడు. మహేష్ టార్గెట్ అదే! అందుకే హేమాహేమీల ఆశీర్వాదం కోసం మహేష్ ఆరాటపడుతున్నాడు. మురుగదాస్కంటూ తమిళంలో ఓ మార్కెట్ ఉంది. అది ఎలాగూ ప్లస్ అవుతుంది. రజనీ, కమల్ లాంటి వాళ్లుకూడా సినిమా గురించి, మహేష్ గురించి మాట్లాడితే ఇంకా హెల్ప్ అవుతుందని మహేష్ నమ్మకం.