శ్రీకాంత్‌కి కథానాయకులందరితోనూ మంచి అనుబంధమే ఉంది. నాగార్జునతో అయితే మరీనూ. అటు విలన్‌గా నటించేటప్పుడూ, ఇటు హీరోగా చేస్తున్నప్పుడూ నాగ్ తో కలసి నటించాడు శ్రీకాంత్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నిన్నే ప్రేమిస్తా’ మంచి హిట్ అయ్యింది కూడా. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని కథానాయకుడిగా పరిచయం చేసింది నాగార్జునే. నిర్మలా కాన్వెంట్ అనే సినిమా అన్నపూర్ణ బ్యానర్లోనే రూపొందింది. అందులో ఓ కీ రోల్ చేశాడు నాగ్. అంతేకాదు.. ఓ పాట కూడా పాడేశాడు. కేవలం నాగార్జున వల్లే ఈ సినిమాకి బజ్ వచ్చింది. శ్రీకాంత్ కూడా ఆ రుణం తీర్చుకొన్నాడు. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన యుద్దం శరణం సినిమాలో నెగిటీవ్ రోల్ చేశాడు శ్రీకాంత్. హీరోగా మారిన తరవాత నెగిటీవ్ క్యారెక్టర్ల వైపు కన్నెత్తి చూడలేదు శ్రీకాంత్. కేవలం నాగార్జున మీదున్న అభిమానంతో నెగిటీవ్ రోల్ అయినా సరే, ఒప్పుకొన్నాడు. అలా.. తన రుణం కొంత తీర్చుకోగలిగాడు. అయితే అటు నాగార్జున చేసిన సినిమా, ఇటు శ్రీకాంత్ చేసిన సినిమా రెండూ ఫట్ అయ్యాయి. ఓ ఫ్లాప్‌కి మరో ఫ్లాప్‌తో లెక్క సరిచేశారు. దాంతో చెల్లుకు చెల్లు అయిపోయిందన్నమాట.