నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తెలుగుదేశం ఎన్నికల ప్రచారం ప్రధానంగా ఆ మాటల చుట్టూనే తిరిగింది. అయితే ఆయన అనడం తప్పే గాని ఎంతసేపూ అదే విషయమై వివాదం సాగిస్తే విధానాలపై చర్చ పక్కకు పోతుందని నాలాటి వాళ్లం చెప్పాం. అయినా సరే ఇద్దరికీ విధానాలపై చర్చ ఇష్టం లేకపోవడంతో ఆ ధోరణి కొనసాగింది.జగన్ మాటలను చాలా మంది తప్పు పట్టడం సరైందే గాని చంద్రబాబు కూడా తీవ్రంగానే మాట్లాడారన్నది నిజం.ఆఖరుకు డేరాబాబాతో అసంబద్దమైన పోలిక తెచ్చారు. అది చూసిఉత్సాహపడిన టిటిడిపి నేత రేవంత్ రెడ్డి కెసిఆర్ కూడా డేరాబాబానే అన్నారు. ఇదంతా ఒక ప్రహసనమై పోయింద. జగన్ కూడా తనపై వచ్చిన విమర్శలమేరకు అవసరమైన మార్పులు చేసుకోకపోగా ఇడుపుల పాయలో మళ్లీ అలాటి మాటలే మాట్లాడారు.ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా జగన్మానసిక స్థితి సరిగ్గా లేదని ఆరోపించారు. ఒకరు అనడం తప్పయితే మనం అనడం కూడా తప్పే కదా? ఇంటింటికీ టిడిపి వీరూ గడపగడపై వైసీపీ పేరిట వారూ ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే ఆ పేరుతో మరోసారి దూషణలకు నిందారోపణలకు దిగితే ప్రజలు భరించడం కష్టం.