సాధారణంగా రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ‘మీడియం’ రేంజు సినిమాలు కాస్త జంకుతాయి. ఇద్దరి మధ్య నలిగిపోతామేమో అన్న బెంగ ఉంటుంది. అటు ‘జై లవకుశ’, ఇటు ‘స్పైడర్..’ వీటితో పోటీ పడే.. ఏ సినిమాకైనా తెగింపు, ధైర్యం అవసరం. ఈ రెండు సినిమాలతో పాటు దసరాకి విడుదల అవుతున్న మహానుభావుడు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. దసరా సీజన్ అని శర్వా టెమ్ట్ అవుతున్నా – దసరా వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనం ఈ సినిమాకి పెద్దగా ఉండకపోవొచ్చు. కాకపోతే… శర్వాని సెంటిమెంట్ కూడా ప్రోత్సహిస్తోంది.
వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో తన సినిమాని విడుదల చేశాడు శర్వానంద్. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి రెండూ పెద్ద హీరోలతో, పెద్ద సినిమాలతో పోటీగా వచ్చి నిలదొక్కుకొన్నవే. రెండూ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని సాధించాయి. పెద్ద హీరోలతో తలపడిన ప్రతీసారీ శర్వా హిట్ కొట్టాడు. సేమ్ టూ సేమ్ పండగలకు వచ్చినప్పుడు కూడా శర్వా లబ్ది పొందాడు. సేమ్ టూ సేమ్ ఈసారీ అలానే జరగబోతోందన్నది చిత్రబృందం నమ్మకం. అందుకే రెండు బడా హీరోలు వస్తున్న తరుణంలో కూడా.. శర్వా ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ దసరాకీ.. శర్వా హిట్ కొట్టేస్తే – ఈ సెంటిమెంట్ మరింత బలపడిపోవడం ఖాయం.