కమల్ కొత్త పార్టీ కి రంగం సిద్దమైంది. బహుశా విజయదశమికి గానీ, గాంధీ జయంతి కి గానీ పార్టీ ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
కమల్ ఇటీవలే కేరళ ముఖ్య మంత్రి ని కలిసి రాజకీయ అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్ తన రంగు కాషాయం కాదని, తన రంగు ఎరుపేనని వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే. అయితే చాలా మంది కమల్ సొంత పార్టీ పెట్టక పోవచ్చనీ, డిఎంకె లో చేరడమో లేక డిఎంకె కి మద్దతివ్వడమో మాత్రమే చేస్తాడని అనుకున్నారు. కాబట్టి అటు రజనీ పార్టీ పెట్టి, బిజెపి కి మద్దతుగా ఎండిఎ కి మద్దతుగా ఉంటే, కమల్ డిఎంకె కి కాంగ్రెస్ కి యూపిఎ కి మద్దతు గా ఉంటాడని భావించారు.
కానీ తాజా పరిమాణాలని బట్టి చూస్తే కమల్ కూడా కొత్త పార్టీ ని స్థాపిస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో జరిగే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి పార్టీ సంసిద్దమవుతోందని తెలుస్తోంది. సుమారుగా 4000 స్థానిక అభ్యర్థులని నిలబెట్టే అవకాశముందని తెలుస్తోంది. డిఎంకె తో పొత్తు కూడా ఈ ఎన్నికల్లో ఉండదని తెలుస్తోంది. బహుశా కమల్ తన సొంత బలాన్ని తెలుసుఓవడానికి ఇది మంచి అవకాశమని భావిస్తున్నట్టుగా ఉంది. సో, మొత్తానికి ఈ నెలాఖరుకి ఈ విషయం మీద ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట.