జై లవకుశ ట్రయిలర్ నెట్ వ్యూస్ సినిమా జనాలకు జిగేల్ మనిపించాయి. ఇప్పటికే అన్ని సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫారమ్ లు కలిపి కోటికి పైగా వ్యూస్ అందుకుంది. ఇప్పుడు ఈ టాస్క్ స్పైడర్ పై వుంది. మహేష్ బాబు సినిమా స్పైడర్ కూడా ఈ రికార్డు ఫీట్ సాధించాలి. కానీ సాధిస్తుందా? అన్నది అనుమానం. స్పైడర్ ట్రయిలర్ వచ్చిన మర్నాడే మహానుభావుడు ట్రయిలర్ వస్తోంది. దీనికి తోడు స్పైడర్ ట్రయిలర్ వచ్చే టైమ్ లోనే జై లవకుశ లోని తమన్నా-ఎన్టీఆర్ విడియో సాంగ్ కూడా బయటకు రావచ్చని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇలా విడియోల మీద విడియోలు వచ్చేస్తే, పాపం, స్పైడర్ పరిస్థితి ఏమిటి?
పైగా సోషల్ నెట్ వర్క్ లో మెగా హీరోలు, ఎన్టీఆర్ అంత పవర్ పుల్ కాదు మహేష్ బాబు ఫాలోవర్స్. అభిమానులు అయితే భారీ సంఖ్యలో వున్నారు కానీ, నెట్ లో మాత్రం అంత సూపర్ ఏక్టివ్ కాదు.పైగా హిట్ లు అంటే వివిధ ఫ్లాట్ ఫారమ్ లకు స్పాన్సర్ షిప్ లు అవీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు స్పైడర్ ప్రచారం వ్యవహారాలు చూస్తుంటే అంత సీన్ వున్నట్లు కనిపించడం లేదు. స్పైడర్ మీదకు తమన్నా అయిటమ్ సాంగ్ రావడం అంటే తెరవెనుక భలే పోటీకి తెరతీసినట్లే అనుకోవాలి.