అమరవాతి నిర్మాణం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కివచ్చేట్టు లేదు. లండన్ కు చెందిన నార్మన్ పోస్టర్ కంపెనీ తయారు చేసిన కొన్ని డిజైన్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని బాగున్నా, మరికొన్ని బాగోలేదని ఆయన అన్నారు.వచ్చే నెలలో లండన్ కు ఒక బృందం వెళ్లాలని, ఆ బృందంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కూడా పంపించాలని చంద్రబాబు సూచించినట్లు కధనం.
అయితే ఇప్పుడు దీనిపై విపక్షాల విమర్శలు మొదలయ్యాయి. బాబు కి కావలసింది అమరావతా లేక మహిష్మతా అని ప్రశ్నిస్తున్నాయి. రాజధానికి “విజువల్ అప్పీల్” ముఖ్యమే అయినా, దాని కంటే ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకి విపత్తులని తట్టుకునే సామర్థ్యం, మౌలిక వసతుల కల్పన ఇలాంటివి ముఖ్యమనీ, వాటికంటే ఎక్కువగా విజువల్ అప్పీల్ కి ప్రాధాన్యమివ్వడం తప్పని విమర్శిస్తున్నారు. అదే సమయం లో విదేశాల్లో కంటే మంచి నిపుణులు ఇండియాలోనే ఉన్నారనీ కానీ చంద్రబాబు ఈ విదేశీ నిపుణుల మీదే ఆధారపడటం లో ఆంతర్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి బాబు, రాజమౌళిని సంప్రదించమని సూచించి మళ్ళీ విపక్ష విమర్శలకి తావిచ్చినట్టయింది.