ఇక త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో కి పూర్తి స్థాయిలో వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టొబర్ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలుంటాయని పవన్ చెప్పినప్పటికీ, త్రివిక్రం సినిమా ఇంకా పూర్తి కాకపోవడమూ, భార్య ఆనా డెలివరీ డేట్ అక్టోబర్ లో ఉండటం వల్ల పవన్ అక్టోబర్ లో ఏవైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం సందేహమే. అయితే పార్టీ తరపున సభ్యత్వ నమోదు త్వరలో మొదలవనుందని తెలుస్తోంది.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సాంకేతిక పరిఙ్ఞాన్ని బాగా ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. జనసేన సభ్యత్వ నమోదు ఆన్ లైన్ లో చేసుకోవడానికి యాప్ రూపొందనుంది. ప్రస్తుతానికి టెక్నికల్ టీం యాప్ ని రెడీ చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ అందులో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం వల్ల, ఆ మార్పులు ఇంప్లిమెంట్ చేసి త్వరలో నే పూర్తి స్థాయి జనసేన యాప్ ప్రజల ముందుకి తీసుకురానుంది టెక్నికల్ టీం.
అయితే యాప్ లాంటి సాంకేతిక హంగులతో పాటు ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేస్టే ప్రజలకి మరింత దగ్గరయే అవకాశముంటుంది. చూద్దాం, జనసేన యాప్ ఎలా ఉండబోతోందో, దానికి ప్రజల స్పందన ఎలా ఉండబోతోందో!!!