నందమూరి బాలకృష్ణ 102వ సినిమాలో ముగ్గురు కథానాయికలున్నారు. ఇప్పటికే నయనతార కథానాయికగా ఖరారైంది. నటాషా మరో నాయికగా తీసుకొన్నారు. ఈ మలయాళీ భామని చూస్తే బాలయ్య పక్కన ఎలా సెట్ అవుతుందా?? అనుకొన్నారు. బాలయ్య పక్కనైతే మరీ కూచిలా కనిపిస్తుందేమో అనిపించింది. నిజానికి నటాషా ని ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్గా తీసుకోలేదు. తను నయనతారకు కూతురిగా కనిపించబోతోందట. బాలకృష్ణ బ్రహ్మచారిగా కనిపించబోతున్నాడు. తన పక్కనే ఓ కథానాయికని వెతకాల్సివుంది. నయనతార కూతురు నటాషాకి ఎదురైన ఓ సమస్యని బాలయ్య తన భుజాలపై వేసుకొని ఎలా పరిష్కరిస్తాడన్నదే అసలు కథ అని తెలుస్తోంది. మరి బాలయ్య పక్కన కనిపించే ఆ కథానాయిక ఎవరో తెలియాల్సివుంది. ప్రస్తుతం కుంభకోణంలో షూటింగ్ జరుపుకొంది. 2018 జనవరిలో ఈ సినిమాని విడుదల చేసే సన్నాహాల్లో ఉంది చిత్రబృందం.