ఒక కులాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని వ్యాఖ్యానించారు కొణిజేటి రోశయ్య. తాము జాగ్రత్తగా మాట్లాడినంత మాత్రాన ఆర్యవైశ్యులు చేతకానివారని భావించొద్దని హెచ్చరించారు తమిళ నాడు మాజీ గవర్నర్ రోశయ్య. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో వ్యక్తిగత అభిప్రాయాలని కులాలకి ఆపాదించొద్దని ఆయన వ్యాఖ్యానించారు.కంచె ఐలయ్య వైశ్యులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ, ఆయన ఈ మాటలన్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమం లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
కంచె ఐలయ్య ఆర్యవైశ్యులని ఉద్దేశించి సామాజిక స్మగ్లర్లు అంటూ పుస్తకం వ్రాసిన విషయం తెలిసిందే. ఇటు ఆర్య వైశ్య సంఘాలు ఆ పుస్తకాన్ని నిషేదించాలని పట్టుబడుతుంటే అటు ఐలయ్య దూకుడు పెంచి, మోదీ, అమిత్ షా లు కూడా వైశ్యులే అని, వైశ్యులు బిజెపి కి ఇచ్చే విరాళాల్లో 5% ఇస్తే తెలంగాణ లో రైతు ఆత్మహత్యలుండవని అన్నారు. చూస్తూ ఉంటే, ఇప్పటికే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐలయ్య కి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందేమోననిపిస్తోంది.