గురు తరవాత వెంకటేష్ సినిమా ఏంటన్నది ఇంత వరకూ తేలలేదు. కనీసం నలుగురైదుగురు కథలు చెప్పారు. కానీ.. వెంకీ దేనికీ తలొగ్గలేదు. అలవాటు ప్రకారం రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టాడు.కానీ అందులోనూ కిక్ కనిపించలేదు. మల్టీస్టారర్ లైన్లు విన్నాడు. దానికీ నో చెప్పాడు. చివరికి తేజతో జట్టు కట్టడానికి సిద్ధమైనట్టు టాక్. వెంకీ – తేజ…కాంబో ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందని, ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ లోనేఉంటుందని టాక్. వెంకీ – తేజల సినిమా ఇది వరకే పట్టాలెక్కాల్సింది. కానీ.. తేజ ఫామ్‌లో లేకపోవడంతో వెంకీ ధైర్యం చేయలేకపోయాడు. నేనే రాజు నేనే మంత్రితో తేజ మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలొచ్చాయి. తేజ మనసు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో సురేష్‌బాబుకి తెలిసొచ్చింది. అందుకే… వెంటనే తన బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అలా.. ఈ కాంబో సెట్టయ్యింది. తేజ తో పని చేయడానికి బాలకృష్ణ, తమిళ కథానాయకుడు కార్తి కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే.. వాళ్లతో అర్జెంటుగా సినిమా తీసే ఛాన్స్ లేదు. అందుకే… తేజ వెంకీ ఆప్షన్‌కి టిక్ పెట్టాడేమో.