నంద్యాల, కాకినాడ ఎన్నికలూ, ఫలితాలూ అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఎలక్షన్ కర్నూలేనా? అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. నంద్యాల, కాకినాడ గెలిచిన ఊపుతో టిడిపి, కర్నూల్ లో 2014 లో ఎక్కువ ఎమ్మెల్యేలలని గెలిచిన స్థాన బలిమితో వైసిపి రంగం లోకి దిగనున్నాయి. ఇది కూడా గెలిస్తే టిడిపి కి 2019 కి మార్గం సుగమం కానుండగా, టిడిపి ని ఓడిస్తే కోల్పోయిన స్థైర్యాన్నంతా ఒక్కసారి గా పొందుకునే అవకాశం వైసిపికి ఉంది.
1994 లో కర్నూల్ కార్పోరేషన్ గా మారింది. మొదటి పీఠాన్ని టిడిపి దక్కించుకుంది కానీ ఆ తర్వాత 23 యేళ్ళుగా పీఠానికి దూరంగా ఉంది. ఇక వైసిపి మొదటిసారిగా కర్నూల్ కార్పోరేషన్ బరిలోకి దిగనుంది. మొన్నటి నంద్యాల ఎన్నికల్లో “నోటా” తో పోటీపడిన కాంగ్రెస్ ఈసారి బరిలోగి దిగాలా వద్దా అన్న తర్జనభర్జనలో ఉంది. ఇక హైదరాబాద్ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న కర్నూల్ కార్పోరేషన్ లో తానూ పోటీ చేయాలని మజ్లిస్ కూడా ఉత్సాహపడుతోంది. ఇక బిజెపి విషయానికి వస్తే, టిడిపి నంద్యాలలో లాగా బిజెపి ని తోడు తెచ్చుకోకుండా వెళ్తుందా లేక కాకినాడ లా కలిసి వెళ్తుందా అనేదాన్ని బట్టి బిజెపి పరిస్థితి ఉంటుంది. అయితే ఎలాగూ ప్రధాన పోటీ టిడిపి వైసిపిల మధ్యే ఉంటుంది. వీరైద్దరి పోరు ఏ మలుపు తిరగనుందనేదే అక్కడ ఆసక్తికరమైన విషయం.
ఏదేమైనా, త్వరలో మళ్ళీ ఎన్నికల రణం షురూ కానుంది!!!