ఎందుకనో… ‘స్పైడర్’పై ముందు నుంచీ కాస్త డివైడ్ టాక్ నడుస్తోంది. మహేష్ – మురుగదాస్ కాంబినేషన్‌కి స్వతహాగా రావల్సినంత హైప్ ఈ సినిమాకి లేదన్నది వాస్తవం. సినిమా ఆలస్యం అవ్వడం, రీ షూట్లు జరిగాయన్న ప్రచారం తోడవ్వడం, పాటలు మైనస్ కావడం… ఇలా డివైడ్ టాక్ కి చాలా కారణాలున్నాయి. కానీ… నాలుగురోజుల నుంచీ ‘స్పైడర్’ గాలి మారినట్టు కనిపిస్తోంది. లాబ్ రిపోర్ట్, సెన్సార్ రిపోర్ట్, విజులవ్ ఎఫెక్ట్స్ చేసిన కంపెనీ నుంచి వచ్చిన రిపోర్ట్ ఇవన్నీ చూస్తుంటే – ‘స్పైడర్’ తో మహేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ ‘సినిమా ఏమంత బాగాలేదట’ అన్నవాళ్లు కూడా.. ‘సెకండాఫ్ ఇరగదీసింది’ అనే రేంజ్‌కి వచ్చేశారు.
తమిళ సినీ వర్గాలు కూడా ‘స్పైడర్ సెకండాఫ్ అదిరిపోయింది… ఈ సినిమాతో మురుగదాస్ సూపర్ హిట్ కొడుతున్నాడు’ అనుకొంటున్నారు. అంతే కాదు..ఎస్.జె సూర్య పాత్ర, అందులో అతని నటన ఈ సినిమాని మరో రేంజ్లో తీసుకెళ్లాయని తెలుస్తోంది. టీజర్లో చూస్తుంటే.. ఓ పెద్ద బండరాయి రోడ్డుపై దొర్లుకొంటు వస్తున్న షాట్స్ కనిపిస్తున్నాయి. బుల్లి తెరపై అవన్నీ ఎఫెక్టీవ్ గా కనిపించడం లేదు గానీ.. సిల్వర్ స్క్రీన్ పై ఆ సీన్ పేలిపోతుందట. ఆ బండరాయిని ఆపడానికి హీరోగా మహేష్ చేసే ప్రయత్నం కూడా ఉత్కంఠత రేకెత్తిస్తుందని తెలుస్తోంది. విజులవ్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దిన మరో కీలక సన్నివేశం ఈసినిమాలో ఉందట. అదీ.. అందరినీ అలరిస్తుందని సమాచారం. మహేష్ ఎంట్రీ, ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండాఫ్ ఈ సినిమాని నిలబెట్టాయని, ఈ దసరాకి మహేష్ బాక్సాఫీసుని దడదడలాడిస్తాడని చెప్పుకొంటున్నారు. ఇవన్నీ నిజమైతే అంతకంటే కావల్సిందేముంది??