మహేష్‌బాబు – రాజమౌళి… వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాహుబలి 2 తరవాత…. ఈ కాంబోనే సెట్స్‌పైకి వెళ్తుందని అనుకొన్నారు. అయితే మధ్యలో ఏమైందో.. సమీకరణాలు మారిపోయాయి. మహేష్ తన సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి.. బాహుబలి 2 తరవాత సుదీర్ఘ విరామం తీసుకొంటున్నాడు. మీ తదుపరి సినిమా ఎవరితో? అని అడిగితే – కథ గురించే ఆలోచించలేదని, ఇక కథానాయకుడి గురించి ఎలా చెబుతామని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు రాజమౌళి. దాంతో మహేష్ – రాజమౌళిల సినిమా ఇప్పట్లో ఉండనే ప్రచారం జోరందుకొంది.
అయితే ఈ కాంబోపై మహేష్ స్పందించాడు. రాజమౌళితో సినిమా విషయంలో తన మనసులోని మాట బయటపెట్టాడు. `స్పైడర్` ప్రమోషన్ల సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రింట్ మీడియాతో మహేష్ మాట్లాడాడు. ఈ సందర్భంగా రాజమౌళి సినిమాపై తన అభిప్రాయం వెలుబుచ్చాడు. ”రాజమౌళితో సినిమా తప్పకుండా ఉంటుంది. అయితే ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. బహుశా 2018 చివర్లో మా ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు” అన్నాడు మహేష్. భరత్ అనునేను 2018 ప్రధమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తరవాత.. వంశీపైడిపల్లి సినిమా పట్టాలెక్కుతుంది. వంశీ పైడిపల్లి సినిమా పూర్తయ్యాకే రాజమౌళి ప్రాజెక్ట్ కదులుతుంది. ఈలోగా రాజమౌళి మరో హీరోతో సినిమా పూర్తి చేస్తాడు. అదీ.. లెక్క.