“అవును, రాజకీయాల్లోకి వస్తున్నాను. కానీ కషాయం మాత్రం నా రంగు కాదు”. ఇదీ కమల్ హాసన్ నిన్న మొన్నటిదాక అన్న మాట. పైగా , తాను హేతువాదిననీ, కమ్యూనిస్టులే నా హీరోలనీ అన్నాడు అప్పట్లో కేరళ సిఎం విజయన్ ని కలిసినప్పుడు . ఇక మొన్నటికి మొన్న కేజ్రీవాల్ ని కలవడం ద్వారా థర్డ్ ఫ్రంట్ దిశగానో, యూపిఎ దిశగానో అడుగులు వేస్తున్నాడని అందరూ కన్ ఫర్మ్ కూడా అయ్యారు.
కానీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు లోక నాయకుడు. అవసరమైతే బిజెపి తో కలవడానికి సిద్దమని ప్రకటించేసాడు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అందుకోసం ఎవరితో నైనా కలుస్తానని అన్నాడు. నిజంగా ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడాడు. కాకలు తీరిన రాజకీయ నాయకులు తరచుగా మాట్లాడే మాటే ఇది, “ప్రజా ప్రయోజనాలు” అని.
అయినా అప్పుడెప్పుడో కన్యాశుల్కం లో గిరీశం పాత్రకి గురజాడ గారు ఒక డైలాగు వ్రాసారు – “నా దృష్టి లో ఒపీనియన్ మార్చుకోని వాడు అసలు రాజకీయ నాయకుడే కాదు” అని. 125 యేళ్ళ క్రింద వ్రాసిన ఈ డైలాగు ని బహుశా అందరు నాయకుల్లాగే, ఈ విశ్వ నటుడు కూడా అప్పుడే ఒంట బట్టించుకున్నట్టుంది.